Type Here to Get Search Results !

Kondalatattu Na Kanulettuchunnanu Song Lyrics | కొండల తట్టు నా కనులెత్తుచున్నాను Song Lyrics

Kondalatattu Na Kanulettuchunnanu Song Lyrics | కొండల తట్టు నా కనులెత్తుచున్నాను Song Lyrics

Kondalatattu Na Kanulettuchunnanu Song Lyrics
కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా
బాధలు బరువెక్కి వున్నాను
నా గోడు వినువారు లేక
నా తోడు ఎవ్వరు రాక
నీ వైపు చూసాను
దేవా నిన్నాశ్రయించాను

ఆరాధన ఇది నా ఆరాధన
ఆత్మతో సత్యముతో ఆరాధన
ఆరాధన ఇది నా ఆరాధన
విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)

కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా
బాధతో బరువెక్కి వున్నాను

(1)నన్నుగా నన్ను నన్నుగా
ప్రేమించు వారు లేరు ఇక్కడ
మిన్నగా నీకంటే మిన్నగా
కరుణించు వారులేరు ఎక్కడ (2)

ఆరాధన ఇది నా ఆరాధన
తప్పులు మన్నించినందుకారాధన
ఆరాధన ఇది నా ఆరాధన
ఒప్పులు నేర్పించినందుకారాధన (2)

కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా
ప్రేమతో నిను నింపుకున్నాను


(2)పాపిగా నేను ఉండగా
ఛీదరించుకున్నవారు ఇక్కడా
పాపినే ప్రేమించగా
పరలోకము విడిచి వచ్చినావుగా (2)

ఆరాధన ఇది నా ఆరాధన
శిక్షను తప్పించినందుకారాధన
ఆరాధన ఇది నా ఆరాధన
శిక్షణ ఇప్పించినందుకారాధన (2)


కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా
దేవా నిను నింపుకున్నాను


(3)శ్రమలలో నలుగుతుండగా
స్పందించువారు లేరు ఇక్కడా
సిలువలో బహు శ్రమలలో
ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా (2)

ఆరాధన ఇది నా ఆరాధన
నా స్థానం పొందినందుకారాధన
ఆరాధన ఇది నా ఆరాధన
నీ స్థానం ఇచ్చినందుకారాధన (2)


కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను
గుండెల నిండా
బాధలు బరువెక్కి వున్నాను
నా గోడు వినువారు లేక
నా తోడు ఎవ్వరు రాక
నీ వైపు చూసాను
దేవా నిన్నాశ్రయించాను

ఆరాధన ఇది నా ఆరాధన
ఆత్మతో సత్యముతో ఆరాధన
ఆరాధన ఇది నా ఆరాధన
విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area