Brathakalanna aasha Song Lyrics | బ్రతకాలన్న ఆశ Song Lyrics
బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే
బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే
యేసయ్యా నా కనులను వెలిగించింది నీ ప్రేమే
దాస్యము నుండి విడిపించి నను దరిచేర్చెను నీ చెంతకే
ప్రేమే నీవై నా కొరకే త్యాగమై
నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై
నా జీవనాధారమై నను నడిపే సారధివై
వెలిగించే దీపమై నా బ్రతుకంతా పండుగవై
1.నీకు దూరమైన నా బ్రతుకు పాపపు చెరకు బలికాగా
బ్రతుకునిస్తావన్న ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా
నిను విడిచిన నాకు విందే చేసిన బహు వింతైన నీ ప్రేమ
నేనున్నా నీకు భయమేలనంటూ ఓదార్చిన నీ ప్రేమ
2.నా కఠినహృదిని కలిగించిన అతి స్వచ్చమైన నీ ప్రేమ
సంగీతముగా నామదిని మ్రోగింపజేసెను నీ ప్రేమ
పరిశుద్ధమైన వాక్యము ద్వారా పరివర్తన కలిగెను నాలో
చీకటి బ్రతుకుకు తెరదించి నూతన పరిచెను నన్నిలలో
3.కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం
కమనీయమైన నీ ప్రేమ చరితం మానవాళికే మార్గదర్శకం
నిను వెంబడించుటే పాపికి మోక్షం, నీ మార్గమే జీవము
నిను చేరుకొనుటయే బ్రతుకుకు అర్థం, నీదే ఈ జీవితం