Type Here to Get Search Results !

Veyi Kallatho Song Lyrics | వేయి కళ్ళతో Song Lyrics | Raj Prakash Paul Songs Lyrics

Veyi Kallatho Song Lyrics | వేయి కళ్ళతో Song Lyrics | Raj Prakash Paul Songs Lyrics

Veyi Kallatho Song Lyrics
వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... 2

వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... 2

ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి


పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం
పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం


1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు,
తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము.....
దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక,
ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము...


అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"


2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును,
దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే.....
ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును
ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే... "ఆ షాలేము"


3,.దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని
నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము.....
చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో
ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము... "ఆ షాలేము"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area