Type Here to Get Search Results !

Idi Theliyani Tholiraagam Song Lyrics | ఇది తెలియని తొలిరాగం Song Lyrics

Idi Theliyani Tholiraagam Song Lyrics | ఇది తెలియని తొలిరాగం Song Lyrics

Idi Theliyani Tholiraagam Song Lyrics
ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనకన ఉన్నది
కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
నీ తనువును తడిమే తికమక కాలం..
గమనించకుంటె అది గరళం!

నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పదచూద్దాం
లేవా? నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం
వయసులోన ఉన్న తనకు..
వెంటపడితె నాడు పడతి..
పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా...
నటుని అనుసరించే నీవు..
అతని అనుసరించి చూడు..
కోరికలకు కళ్ళెమేసి వెలుగుతావురా..
ఇది లోకం నేర్పని జ్ఞానం
నీ దేవుడు నేర్పిన పాఠమురా...


మన అబ్రహాము గారబ్బాయున్నాడే...

వయసే వచ్చెనంటూ ఎవరివెంటా పడని మనిషంటా
తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంటా
నీకు నువ్వె యవ్వనాన్ని అప్పగించుకుంటె తనకు
అందమైన తోడునిచ్చే దేవుడుండగా..
నా తనువు నాది అనకు
పాడు చేసుకోకు బ్రతుకు
కోరికిచ్చినా తండ్రి దారి చూపడా..
ఇది మహిమాన్వితుని చిత్తం...
అది నెరవేర్చుట మన బాధ్యతరా..!

ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనకన ఉన్నది
కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
నీ తనువును తడిమే తికమక కాలం..
గమనించకుంటె అది గరళం!

ఇది బైబిలు ఉపదేశం
యువతకు నా సందేశం
ప్రతి స్నేహితుడూ, స్నేహితురాలూ పాటిస్తే సంతోషం!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area