Type Here to Get Search Results !

ఎదురు చూస్తున్నాను Song Lyrics | Eduru Chustunnanu Song Lyrics - Telugu Christian Melody Song Lyrics

ఎదురు చూస్తున్నాను Song Lyrics | Eduru Chustunnanu Song Lyrics - Telugu Christian Melody Song Lyrics

పల్లవి: ఎదురు చూస్తున్నాను- నా యేసయ్యా
నీ రాక కోసమే - నా మెస్సయ్యా (2)
నువ్వొవస్తావనే - ఆశతో నేనున్నానయ్యా
నీ రాకడ గురుతులు - నెరవేరెనయ్యా (2)
అ/ప: రావయ్యా యేసయ్యా - జాగు చేయక నాకున్న ఆశలను - విసిగించక (2) (ఎదురు)

1. లోకం జిగటగల దొంగ - ఊబిలా లాగుచున్నది
జనుల పాపం నానాటికి - పెరిగి పోవుచున్నది (2)
రాజ్యము మీదికి రాజ్యం - జనము మీదికి జనము
బయలుదేరుచుండుటకు - సిద్ధపడుచున్నవి (2)
ఎక్కడ చూచినా - భూకంపములే!
ఎక్కడ చూచినా - కరువు యుద్ధములే! (2)
(రావయ్యా) (ఎదురు)

2. మధ్యాకాశం దూత శబ్ధం - ఆర్భాటముతో వినిపించగా
సమాధులలో నిద్రించువారు - భక్తులు మొదట లేవగా (2)
మేఘములమీద సంఘం - రెప్పపాటులో లేచి
కొనిపోబడగా చూచి - ప్రలాపించెదరు (2) ఎక్కడ చూచినా - దౌర్జన్యములే!
ఎక్కడ చూచినా - అరాచకములే! (2)
(రావయ్యా) (ఎదురు)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area