భయము లేదు దిగులు లేదు Song Lyrics | Bhayamu ledu digulu ledu jeevitha yatralo Song Lyrics - Old Christian Song Lyrics
భయము లేదు – దిగులు లేదు – జీవిత యాత్రలో
యేసు ప్రభువు – మనతోనుండ – భయము లేదుగా
హల్లేలూయ – హల్లేలూయ (2) “భయము లేదు “
గాలి తుఫాను రేగి అలలు పొంగినా
విశ్వాస నావ మునిగి కొట్టబడిన
సముద్రము పొంగి – నురుగు కట్టిన
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”
వ్యాధి భాధలు నన్ను ముట్టినా
అంతులేని వేదనా నాకు కల్గిన
గర్జించు సింహము – ఎదురు వచ్చిన
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”
శత్రువున్ చూచి విస్మయమొందకు
నీతో కూడా వచ్చువాడు నీదేవుడే
నిన్ను విడువడెన్నడు ఎడబాయడు
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా “2”