Type Here to Get Search Results !

భయము చెందకు భక్తుడా Song Lyrics | Bayamu chendaku bakthuda song lyrics - Telugu Christian Song Lyrics

భయము చెందకు భక్తుడా Song Lyrics | Bayamu chendaku bakthuda song lyrics - Telugu Christian Song Lyrics

భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||

బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||

చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||

ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area