Type Here to Get Search Results !

ఆలించు మా ప్రార్థన Song Lyrics | Alinchu ma prarthana Song Lyrics - Andhra Kraistava Keerthanalu

ఆలించు మా ప్రార్థన Song Lyrics | Alinchu ma prarthana Song Lyrics - Andhra Kraistava Keerthanalu

Alinchu ma prarthana Song Lyrics
ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన
నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము
మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||

ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను
నీ సేవకై మేము నెనరుచే నొసఁగు
ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||

ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ
నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||

ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ
జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను
సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||

నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు
ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు
సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||

చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ
పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి
దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area