Type Here to Get Search Results !

ఆనంద మగు ముక్తి Song Lyrics | Anandamagu mukthi Song Lyrics - Andhra Kraistava Keerthanalu

ఆనంద మగు ముక్తి Song Lyrics | Anandamagu mukthi Song Lyrics - Andhra Kraistava Keerthanalu

Anandamagu mukthi Song Lyrics
1.ఆనంద మగు ముక్తి యే నా మందిరము
జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||

2.పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి
దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||

3.బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు
నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||

4.ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్
సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.