Neevega Tholi Guruvu Song Lyrics | నీవేగా తొలి గురువు Song Lyrics
నువ్వేదో.. అదే నీ పిల్లలు -
నువ్వేంటో అవే నీ గర్భఫలాలు || 2 ||
బహుమానాలు దేవునివైనా - సహవాసాలు నీతోనేగా..
ఆ దేవుడు పరిశుద్ధుడైనా - అక్షరాలు దిద్దించేది నీవేగా..
నీవేగా తొలి గురువు - నీ కన్న బిడ్డలకి..
నీ బ్రతుకే ఒక చదువు - నీ చిట్టితల్లి పాఠశాలకి..
అతల్యా తన బిడ్డనే చెడ్డదారిలో పెంచిందిగా..
అందుకే తన కొడుకే దుర్మార్గుడైపోయాడుగా..
అమ్మగా నీవు కమ్మగా నీతిపాలు తాగిపించాలిగా..
అప్పుడే నీ పిల్లడే నీతిమార్గమందు ఉంటాడుగా..
కఠినమైన శిలలను సైతం ఉలితోటి కొడుతూ..
కళలొలికించే అందమైన రూపులోకి తెచ్చుచుండగా..
కలల రేడు నీ కన్న కొడుకును బెత్తమంటి వాక్కుచేత
భక్తిలోన పెంచితే దైవరాజ్య సైనికుణ్ణి చేయగలవుగా..
నువ్వు దారితప్పి చెయ్యమాకు తప్పిదాలు!
చూస్తున్నాయి ఇంట నిన్ను చిన్ని కన్నులు!!
నీవేగా తొలి గురువు - నీ కన్న బిడ్డలకి..
నీ పనులే పాఠాలు - నువ్వు కన్నవాడు ఉన్న బడికి..
నీవు పంచినా నీ రక్తమే నీ బిడ్డలోన ఉంటుందిగా..
నీకు దేవుడిచ్చినా నీ రూపమే తనలోన కనిపిస్తుందిగా..
అందుకే.. నీకు తెలుసునా.. నీ బుద్ధి కూడ వస్తుందిగా..
నీ తత్వమే నీ బిడ్డలో తిష్ట వేసుకుని ఉంటుందిగా..
మరియలాగ మంచిగ ఉంటే.. యేసుక్రీస్తులాంటి ప్రేమగలవాణ్ణి తీర్చిదిద్ది ప్రపంచానికందించవా..
హేరోదియాలా నీవుంటే.. సేవకుణ్ణి చంపిన సలోమే లాంటి
చెడ్డదానిలాగ బిడ్డ మారకుండునా..
మీరు నీతితప్పి చేయకండి చెడ్డపనులు!
నీ జీవితాలు చిన్నవాళ్ళ రాజబాటలు!!
నీవేగా తొలి గురువు - నీ కన్న బిడ్డలకి..
నీ పలుకే అక్షరాలు - వాళ్ళ పసి మది పలకలకీ..