Atha kodalu bandham christian song lyrics | అత్తా కోడళ్ళ బంధం Song Lyrics
అత్తా కోడళ్ళ బంధం... అది తల్లీ బిడ్డల్లాంటి బంధం
కలుపుకుంటేనే బంధం... కలిసి కడదాకా ఉంటేనే అందం
చెప్పింది బైబిలు గ్రంథం ఏనాడో ఆ సంగతి విందాం
సకుటుంబ ప్రయాణానికి బైబిలు చూపింది చక్కని మార్గం
తెలుసుకుందాం... నడుచుకుందాం...
కుటుంబాల్ని కట్టుకుందాం... 11అత్తా11
కన్న ఇంటి గడప దాటీ... నీ ఇంటి గడప తొక్కి
కన్నోళ్లని, తోబుట్టువుల్నీ విడిచి నిన్ను చేరింది దీపం
ఆనందంగా ఆహ్వానించూ... ఆరనివ్వకుండా ఉంచు
బిడ్డవోలె స్వీకరించూ... అమ్మలాగ ఆదరించు
క్రీస్తుప్రేమ చూపించూ... క్రైస్తవురాలివనిపించు
ఇరుగు పొరుగు స్త్రీలందర్నీ.. క్రీస్తులోకి నడిపించు
నవయవ్వన కూతుర్ని కన్నా అమ్మలాగా కనిపిస్తే నీవొక నవయుగ నయోమివేగా..
ఆ దేవుని దీవెన నొందెదవుగా...! 11 అత్తా 11
తల్లిచోటు భర్తీ చేసి.. తల్లినిచ్చే దేవుడు నీకు
అత్తా అని పిలిచిన గానీ.. అమ్మలాగే చూడాలి నీవు
మాటా మాటా పెంచుకోకూ.. తగవులాడి తెంచుకోకు
వయసుమీరి మాట అంటే.. కనికరించు పోయేది లేదు
ఓర్పు మారుపేరు నీకూ.. ఓర్పాలాగా విడిచిపోకు
లోకంతీరు నేర్చుకోకూ.. కాపురాన్ని కూల్చుకోకు
అత్తచాటు కోడలివైతే.. ఆసరాగా తనకుంటే.. నీవొక ఆదర్శ కోడలివేగా...
నాటి రూతుకి ఏమాత్రం తీసిపోవుగా... 11అత్తా 11