Type Here to Get Search Results !

Nammina roje chusanayya nee mahima lyrics | నమ్మినరోజే చూశానయ్య Song Lyrics

Nammina roje chusanayya nee mahima lyrics | నమ్మినరోజే చూశానయ్య Song Lyrics

Nammina roje chusanayya nee mahima lyrics
నమ్మినరోజే చూశానయ్య నీ మహిమ
నా ఆత్మకు దూతవు నువ్వేనయ్య యేసయ్యా
అపరాధినైనరోజున మన్నించావు చాలయ
ఆరాధనుండేచోటున దూరంగా నువు లేవయ

1. విలవిలలాడినరోజున తోడున్నావయ్యా
కళకళలాడేరోజులు రప్పించావయ్యా
నా ఆధారము నువ్వే
నా ఆహారము నువ్వే
నా ఆలోచన నువ్వే
నా అనురాగము నువ్వే
నిను పూజించే అభిమానిగా నేమారిపోయాను

2. బాధను మింగే ఓపిక ఏర్పరచావయ్యా
ప్రార్థన చేసే తీరిక కల్పించావయ్యా
నా ఆర్భాటము నువ్వే
నా అంతస్తువు నువ్వే
నా బహుమానము నువ్వే
నా కిరీటము నువ్వే
నిను సంధించే నీ వధువుగా నేమారిపోయాను

3. తండ్రీ అని పిలిచేందుకు యోగ్యతలేదయ్యా
వేరేవారిని పూజించే కోరికలేదయ్యా
నా శిక్షకుడౌ నువ్వే
నా సామ్రాజ్యము నువ్వే
నా పంజరము నువ్వే
నా పరిహారము నువ్వే
నిను ప్రకటించే బోధకునిగా నేమారిపోయాను

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area