యేసునాధా దేవా వందనాలు రాజా Song Lyrics | Yesu nadha Deva Vandanalu Song Lyrics - Telugu Jesus Worship Song Lyrics
యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు
రాజాధిరాజా నీకే వందనాలు
రవికోటి తేజ నీకే వందనాలు
1.పాపిని కరుణించి ప్రాణదానమిచ్ఛావు
పరమ జీవమిచ్చి పరలోకరాజ్యమిచ్చి
పండ్రెండు గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా
2. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్ఛి నిత్య రాజ్యమిచ్చావు
నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే
3. కన్నుమిన్ను కానకుండ నిన్ను వీడిపోయాను
చిన్నబుచ్చుకోకుండ నన్ను సమకూర్చావు
నీ మనసే వెన్నయ్యా నాకన్న తండ్రి నా యేసయ్యా