సరిరారు నీకెవ్వరు.. నా యేసయ్య Song Lyrics | Sariraaru nikevaru Song Lyrics - Jesus Songs
సరిరారు నీకెవ్వరు.. నా యేసయ్య..
సాటిలేరు నీకెవ్వరు..
నా ప్రభూవా!
సాటిలేరు నీకెవ్వరు. //2//
నిన్నే ఆరాధింతును ౼ నీలో ఆనందింతును //2//
//సరిరారు నీకెవ్వరు//
ఆనందకరమైన నీ సన్నిధిలో -
ఆదరించి నన్ను చేరదీసినావయ్య. //2//
"నీ ప్రేమతోనే నన్ను ఎన్నుకున్నావు.." //2//
అందరి బంధువు - నీవే నా యేసయ్య.
//నిన్నే//2// సరిరారు//
ఆరోగ్యకరమైన నీ వాక్యముతో -
ఓదార్చినావు నా బాధలన్నిటిలో. //2//
"నీ కృపతోనే నన్ను నడుపుచున్నావు.." //2//
స్తుతులకు పాత్రుడా - నీవే నా దేవుడవు.
//నిన్నే//2// సరిరారు//