హృదయమా నా హృదయమా Song Lyrics | Hrudayama Na Hrudayama Song Lyrics - Melody song Lyrics
హృదయమా నా హృదయమా…
యేసుని ఆహ్వానించు
నింగి నీ మీద పడినను
భయపడకు నా హృదయమా
1. యేసుని రుధిరములో శక్తిగలదు
నమ్ముము నా హృద యమా
పరితపించి నీవు ప్రార్ధించిన
క్షమియించును శ్రీ యేసుడు
ప్రభుయేసుని శరణు వేడుమా
త్రోసేయడు నిన్నెన్నడు
2. నీతికలిగి నీవు జీవించిన
ఆపదలన్నీ తొలగును
భక్తితో నీవు ప్రార్ధించిన
కోరిన వరములిచ్చును
ప్రభుయేసుని సన్నిధిలో
సఫలమగును నీ కోరికలు