తిరిగి లేచాడు శ్రీ యేసు నాథుండు Song Lyrics | Thirigi Lechadu Song Lyrics - Telugu Easter Song Lyrics
తిరిగి లేచాడు శ్రీ యేసు నాథుండు
మరణమును గెలిచి మన నిత్య జీవముకై
దైవ తనయుడు సిలువలో కార్చి రక్తమును
నీదు నాదు ఘోర పాపము పారద్రోలెను
హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా అని పాడెదం
అంతులేని సంభరముతో
నింగి దాక ఉప్పొంగేదం
అర్హతే లేని హీన జనులము అయిన
తండ్రి రాజ్యముకు మనలన్ పౌరులను చేసే
పాప క్రియలను సిలువలో నిలువరించేను
లోకమును కాచే కాపరి అవతరించేను ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥
నీతిని నిలిపి ప్రభువు పరముకేగాడు
తండ్రి కుడి వైపు తానూ కొలువు తిరాడు
నీవే దిక్కంటూ తండ్రిని వేడుకుందాము
వదలిపోని ఆ రక్షణను పొందుకుందాము ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥
పాపములో మరణం తిరిగి యేసులో జననం
రాదు ఈ తరుణం వలదు కాలయాపనం
శోధనను గెలిచే వెలుగు మనకు ఆభరణం
శాంతి, సమాధానం మనకు దొరికే బహుమానం ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥
మరణము పొంది పరములో మరల బ్రతికేదము
తండ్రి, తనయునితో కూడి కొలువు తిరెదము
దేవ దూతలకే మేము తీర్పు తిర్చేదము
సూర్యుడే లేని లోకంలో వెలుగు పొందెదం ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥