పరిశుద్ధాత్ముడు Song Lyrics | Parishuddatmudu Song Lyrics - New Telugu Easter Song Lyrics
హల్లేలూయ హల్లెలూయ హల్లెలూయ...
హల్లేలూయ హల్లెలూయ హల్లెలూయ ..2..
పరిశుద్ధాత్ముడు - ప్రేమస్వరూపుడు
మహిమాన్వితుడు - అద్వితీయుడు
ఉజ్వలచరితుడు - నిత్యసజీవుడు
మృత్యుంజయుడు - అభిషిక్తుడు. హల్లెలూయ..2..
మరణపు ముళ్ళును విరిచెను
మహిమతో క్రీస్తు లేచెను
రక్షణ మార్గం ఒసగెను
నరకాగ్ని నుండి రక్షించెను
లోకపాపములను పరిహరించెను
జీవద్వారములను తెరిచెను
జీవపు వెలుగును విరజల్లేను
ప్రత్యక్ష దర్శనం జరిపించేను…
హల్లెలూయ..2.
సమాధిద్వారము తెరిచెను
సంకెళ్లు బ్రద్ధలయేను
గలిలియ దద్దరిల్లెను
దైవసుతుడే ఉత్థానమాయెను
ఇహపరములందు దర్శించెను
మహానందముతో స్తుతియించెను
దూతగనములు ఘనపరిచెను
నిత్యరక్షణ ప్రవచించెను ... హల్లెలూయా..2..