నా దేవుని కృప వలన Song Lyrics | Naa Dhevuni Krupa Valana Song Lyrics - Telugu Worship Song Lyrics
నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును (2)
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||
కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును (2)
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||
శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము (2)
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||
ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును (2)
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||