Type Here to Get Search Results !

ఇది నాది అది నాదని ఓరన్నా Song Lyrics | Idi naadi adi nadani Song Lyrics - Gospel Song Lyrics

ఇది నాది అది నాదని ఓరన్నా Song Lyrics | Idi naadi adi nadani Song Lyrics - Gospel Song Lyrics

ఇది నాది అది నాదని ఓరన్నా విర్రవీగుడేందుకు
ఇది నాది అదినాదని ఓ తల్లి గొడవలు నీకెందుకు
ఏది నీది కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశేందుకు
ఏది సొంతం కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశేందుకు ||ఇదినాది||

ఈ రోజు నీది కాదు ఓరన్నా నిన్న నీదనుకున్నది
నేడు నీ ముందున్నది ఓరన్నా రేపు కానరాదుగా
నీటి బుడగ లాంటి ఈ జీవితానికి వాదులాటలేందుకు ||2||

ధనము ధాన్యాలు ఉంటె ఓరన్నా నీ చుట్టూ జనములుంటరు
ఆస్తి అంతస్తులుంటే ఓరన్నా అంత నా వారంటారు
నీ ఆస్తి పాస్తులు తరగి పోయినంక నీతో ఎవ్వరుంటరు ||2||

గడ్డి పువ్వులాంటిది ఓ అన్న ఇలలోన నీ జీవితం
ఆవిరి వంటిదేగా అందము కాదుగా శాశ్వతము
ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి సాదించిన ఒకరోజు వేళ్ళాలిగా ||2||

ఈలోక యాత్రలోన ఓ అన్న పరదేశులం మనమేగా
ఏక్షణము ఒకరోజున ఓరన్న ఈ దేహము విడవాలిగా
బ్రతికినంతకాలము బందాలు ఉంటవి చావుకు బందమేది ||2||

నీలోని ఈజీవము ఓరన్న సృష్టికర్త దానము
పాపానికి జీతముఓరన్న మరణమే ఓ శాపము
ఈరోజు కనుముస్తే నిత్య నరకముంది విడిపించలేరెవ్వరు ||2||

ఆగ్నిలో వేదనుండి అక్కడ నీ ఆత్మా కాలుతుంది
ఏడుపు రోదనుంది అక్కడ పురుగుల బాదఉంది
మంచిగున్నపుడే ఆలోచించుకో నీ పయనమేక్కడికో ||2||

మన పాపముల కోసము మన తండ్రి శాపమాయే సిలువలో
మనపాప శిక్షనంత తనపైన మోసినాడు సిలువలో
రక్తమంతా కార్చి ప్రాణమే అర్పించి శిక్ష కొట్టి వేసెగా ||2||

మరువకు మన యేసుని ఓ అన్న మన ఆత్మకు తండ్రిని
ఆ మహిమ రాజ్యమున నీ కొరకు ఎదురుచూసే తండ్రిని
నీ పాప జీవితం యేసుకప్పగించి నిత్య జీవం పొందుమా ||2||

నమ్మిన వారందరూ ఓరన్నా రక్షించబడుదురన్నా
నమ్మని వారందరూ ఓరన్నా శిక్షింపబడుదురన్నా
యేసు ద్వార తప్ప మోక్షమునకు వేరే దారేదిలేదన్నా ||2||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area