చక్కనైన దారి నీవే Song Lyrics | Chakkanaina dari neeve Song Lyrics - Jesus Songs Lyrics
చక్కనైన దారి నీవే
చేరువైన తోడు నీవే (2)
యేసయ్యా నీవే చాలయ్యా
నా బ్రతుకునందు ఎన్నడూ వీడిపోకయ్యా (2)
1.చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా
జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా (2)
యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా
యేసయ్యా భుజంపై చెయ్యేసావయ్యా
నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా
ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా (2) ||చక్కనైన||
2.అడిగినదానికన్నా అధికం చేసావయ్యా
నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా (2)
యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు
సమీపమైన బంధువువి నీవు
నీ ఆత్మతో దీవించుచున్నావు (2) ||చక్కనైన||