నా కాపరి వైనందున Song Lyrics | Na Kapari Vainanduna Song Lyrics - Yesu Prabhu Patalu
నా కాపరి వైనందున - నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా ఉన్నది
ఆశ్రయమైనదునా నాకు క్షేమముగా ఉన్నది
1. ధైర్యము కోల్పోయినా - భయముతో మది నిండినా
చీకటులే కమ్మినా - సాగలేనని తెలిసినా
మా పితరులను నడిపించినా - నీ సామర్థ్యము మాకు తెలిసినా
మాకు ధైర్యముగా నున్నది - ఎంతో నెమ్మదిగా ఉన్నది
2. ఎండిన మా బ్రతుకును - నీటి ఊటగ మార్చినా
నూతన యెరూషలేములో - మా పేరులే రాసినా
మేఘస్తంభముగా నడిపించిన - నీ మహిమను మాకు చూపించినా
నీతో ఏకమవ్వాలనే - నిరీక్షణ మాకున్నది