లేచినాడయ్య మరణపు ముల్లు Song Lyrics | Lechinadayya Song Lyrics - Telugu Easter Song Lyrics
లేచినాడయ్య మరణపు ముల్లు
విరచి లేచినాడయ్య ॥2॥
పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపుడై లేచినాడయ్య ॥2॥
1॰
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతాను ఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
2॰
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను ॥2॥
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥
3॰
జీవమార్గము మనకు అనుగ్రహించెను
మనపాపములన్నియు తుడిచివేసెను ॥2॥
ప్రేమయై మనకుజీవమై
వెలుగునై మంచికాపరియై ॥2॥
క్రీస్తు లేచెను హల్లెలూయ
సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ
మరణాన్ని గెలిచెను హల్లేలూయ
॥లేచినాడయ్య॥