Type Here to Get Search Results !

ఆ కలువరిగిరిమీద Song Lyrics | Kaluvari giri meeda Song Lyrics - Telugu Good Friday Song Lyrics

ఆ కలువరిగిరిమీద Song Lyrics | Kaluvari giri meeda Song Lyrics - Telugu Good Friday Song Lyrics

ఆ కలువరిగిరిమీద నీవు పలికిన ప్రతి మాట
నా బ్రతుకంతటిలోన - ప్రకటించెద ప్రతి చోట (2)
చంపబడుచూ వుండగా కన్నుమూసే ముందుగా - 2
నీవు పలికిన విలువైన మాటలన్ని ఏడేగా

1.తండ్రీ ! - వీరు ఏమి చేయుచున్నారో

వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా! (2)
చంపుచున్న వారినే క్షమియించే హృదయమే (2)
మాకు కూడా వుండాలని - నీవు నేర్చిన పాఠమే !
|| ఆ కలువరిగిరిమీద ||

2.నేడు నాతో కూడా - నీవు పరదైసులో

వుందువని మారిన దొంగకు సెలవిచ్చావుగా ! (2)
కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే (2)
క్షమియించే మననున్న మహారాజువు నీవేగా !
|| ఆ కలువరిగిరిమీద ||
3.అమ్మా! - ఇదిగో నీ కుమారుడనీ

ఇదిగో నీ తల్లియని - అన్నావు యోహానుతో ! (2)
నిందలెన్నో వచ్చినా - నిన్ను విడువని అమ్మకే (2)
అభయమిచ్చి దారి చూపిన- మంచి బిడ్డవు నీవేగా
|| ఆ కలువరిగిరిమీద ||

4.ఏలి ఏలీ - లామా సబక్తానీ అని

యెడబాటు తండ్రితో - భరించలేకుంటివా? (2)
ఇంటివారే విడిచినా - శిష్య బృందమే వదిలినా (2)
దేవునితో సహవాసానికి ప్రాముఖ్యత నేర్చావా ?
|| ఆ కలువరిగిరిమీద ||

5.దప్పిగొనుచున్నావని ప్రాణముపోయే ముందుగా నీటిని అడిగితే
చేదును ఇచ్చిన మనసులేని వారే ! ఆత్మల రక్షణ దాహమే మరియొకటి నీకుందిగా !
తీర్చకుంటే మేము కూడా మనసులేని వారమే !
|| ఆ కలువరిగిరిమీద ||

6.సమాప్తమైనదని - మా రక్షణ కార్యాన్నీ

మాకు బదులుగా - శిక్షను పొంది సంపూర్తి చేశావా !
కార్యారంభము కన్నా కార్యాంతమే మేలనీ (2)
వచ్చిన పనినీ ముగించి మాకు స్పూర్తిగా నిలిచావే !
|| ఆ కలువరిగిరిమీద ||

7.తండ్రి! నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని

ప్రాణము విడిచావే ! దేవుని చిత్తము చొప్పునే - అనుభవించి బాధనే (2)
సత్ప్రవర్తనతో మేము - అప్పగించాలి ఆత్మలే!

|| ఆ కలువరిగిరిమీద ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area