ఉన్నావు నా తోడుగా Song Lyrics | Hrudhaya Saradhuda Lyrics | Vunnavu na thoduga Lyrics - Krupa Ministries Lyrics

పల్లవి : ఉన్నావు నా తోడుగా
ఎన్నడూ వీడని నీడగా (2)
దాచావు నీ రక్త కోటలో
పెంచావు నీ అనురాగ నిలయములో. (2)
అ. పల్లవి : అర్పింతు నా ప్రాణాత్మ దేహమును
అనురాగ నిలయుడా నీ సేవలో. (2)
1. పిడుగులు విసిరే మెరుపుల వానలో
ఆశలు వదిలి అలసితినయ్యా
మేఘ వాహనుడా నా యేసయ్య
కదలని కోట వై నీలో దాచితివి
(అర్పింతు)
2. బహుగా నన్ను ప్రేమించితివి
నా భారమంతా భరించితివి
సాత్వికుడా నా యేసయ్య
సులువైన కాడిని నాపై మోపితివి
(అర్పింతు)
3. అపవాది విసిరే అగ్ని బాణాలకు
కలవరమాయే నా హృదయములో
హృదయ సారధుడా నా యేసయ్య
సర్వాంగ కవచమై జయ జీవితమిచ్చితివి
(అర్పింతు)