బలపరచుము స్థిరపరచుము Song Lyrics | Balaparachumu sthira parachumu Lyrics - Prayer Song Lyrics

బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు బదులీయుమూ (2)
లోకాశలవైపు చూడకుండా లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకూ
1. నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతునూ
2. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యమూ (2)
అపవాది నన్ను శోధించినా శ్రమలన్నీ నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతునూ