ఎందుకయ్యా యేసయ్యా Song Lyrics | Endukayya Yesayya Napaina Song Lyrics - Telugu Good Friday Song Lyrics
పల్లవి: ఎందుకయ్యా యేసయ్యా -
నాపైన నీకు ఇంత ప్రేమ {2}
అర్హతేలేని యోగ్యతేలేని -
నా పైన నీకు ఇంత ప్రేమ {2}
1} నీ ప్రేమ సామ్రాజ్యములో -
పాలుపొంద భాగ్యము నియ్యా
పాపినైననన్ను కరుణించి -
పరిశుద్ధత నొసగితివే {2}
ఏమిత్తును ప్రేమసాగరా -
నీ ప్రేమకు బదులుగా ఏమిత్తును {2}
2} నీ ప్రేమాను రాగాలు పొంద -
ఎట్టి యోగ్యత నాలో లేదే
ప్రేమగల తండ్రివై నన్ను -
చేరదీసి కృపచూపినావు {2}
ఏమిత్తును కృపాసాగరా -
నీ కృపకు బదులుగా ఏమిత్తును {2}
3} నీప్రేమ సంకల్పమును-
నాలో నెరవేర్చుట కొరకై
జగద్పునాదికి ముందే -
కృపలో ఏర్పరచితివా {2}
ఏమిత్తును దయాసాగరా -
నీ దయకు బదులుగా ఏమిత్తును {2}