ధ్యానించుచుంటిమి Song Lyrics | Dhyaninchuchuntimi Song Lyrics - Telugu Good Friday Song Lyrics
ధ్యానించుచుంటిమి
సిలువపై పలికిన
విలువైన నీ మాటలు (2)
ప్రాణాత్మలను - సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు...
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
1.
తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్థన చేసావా బాధించే వారికై (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
2.
నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగా ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా - దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
3.
ఇదిగో నీ తల్లి - ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడూ (2)
అని శిష్యునికిచ్చావా - అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
4.
దేవా నా దేవా
నన్ను విడనాడితివి వెందుకు
చెవినీయవే నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా - శిక్ష ననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
5.
సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా
కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
6.
సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా - కల్వరిగిరి నుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||
7.
నా ఆత్మను నీచేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తలవంచి తృప్తిగ విజయము చాటి (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా...
||ధ్యానించు||