ఏ గుంపులో వుంటివో నీవెరిగి Song Lyrics | Ye Gumpulo vuntivo Song Lyrics - Telugu Christian Folk Song Lyrics
ఏ గుంపులో వుంటివో నీవెరిగి
తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో
జాగు సేయక వేగమేలుకో || ఏ గుంపులో ||
1. మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు నిర్జీవపు గుంపు
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు || ఏ గుంపులో ||
2. మెచ్చుకొనుటకిచ్చకంబులాడెడి గుంపు
నులివెచ్చని గుంపు
సచ్చియుండిన సమాధుల గుంపు || ఏ గుంపులో ||
3. కరుణ లేక కఠినమైన కరుగని గుంపు
గుర్తెరుగని గుంపు
కరకు కలిగిన కఠోరపు గుంపు || ఏగుంపులో ||
4. సర్వలోక మోసగాడు ఆది సర్పము
అదే ఘటసర్పము
సర్వ భక్తుల హతమార్చెడి గుంపు || ఏ గుంపులో ||
5. మారుమనస్సు పొందిన పరిశుద్ధుల గుంపు
పరలోకపు గుంపు
ఎత్తబడుటకు సిద్ధమున్న గుంపు || ఏ గుంపులో ||