ఎంతో దుఃఖము బొందితివా Song Lyrics | Entho dukhamu pondithiva Song Lyrics - Good Friday Song Lyrics
ఎంతో దుఃఖము బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా =
యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు
- ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకు బెట్టిన - శ్రమలను దలపోయగా ॥ నెంతో ॥
1. వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాడనుచు = నిన్ను -
మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా ॥ యెంతో ॥
2. సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు -
పొందిన బాధ నా - డెందము తలపనా - నందములే దాయెను ॥ ఎంతో ॥
3. కొట్టుకొట్టుమని - తిట్టికేల్ దట్టిని - న్నట్టిట్టు నెట్టుచును = వారు -
పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియు - బెట్టితివా ప్రాణము ॥ నెంతో ॥
4. నెపము బెట్టుచు దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి నారా =
నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకు జూపినావా ॥ యెంతో ॥
5. చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా -
యొక్క దుష్టుడీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా ॥ యెంతో ॥
6. అన్నదమ్ములైన - అక్క సెల్లెం డ్రైన - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్న డైన
బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా ॥ యెంతో ॥