Type Here to Get Search Results !

దేవ దేవుని సన్నిధిలో Song Lyrics | Deva devuni sannidhilo Song Lyrics - Telugu Christian Songs Lyrics

దేవ దేవుని సన్నిధిలో Song Lyrics | Deva devuni sannidhilo Song Lyrics - Telugu Christian Songs Lyrics

దేవ దేవుని సన్నిధిలో
సముహముగా ఉన్నదెవరో
అధిపతి ప్రభు యేసుని సైన్యములో
నిలచిన ఈ ధీరులెవరో (2) ||దేవ||

1 ఒక్క తలాంతో రెండు ఉన్నవో
ఐదు ఉన్నను వాడినవారు
చిన్న పనిలో పెద్ద పనిలో
ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ||

2 అడవులలో పయనించి
ప్రభుని ప్రేమ పంచినవారు
కలిమిలోను లేమిలోను
పట్టుదలగా ప్రార్థించువారు ||దేవ||

3 ఒంటరితనం పేదరికంలో
లాజరులా నిలబడిరి
యాచించిన పోషించిన
విశ్వాసము వీడనివారు ||దేవ||

4. జాతులన్నియు గోత్రాలన్నియు
భాషలన్నియు మాట్లాడువారు
సిలువ క్రింద యేసు రక్తంలో
మంచి పోరాటం పోరాడినారు ||దేవ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area