స్వరమెత్తి పాడేదను Song Lyrics | Swaramethi Padedanu Song Lyrics - Prasing Song Lyrics
స్వరమెత్తి పాడేదను నీ ప్రేమ యేసయ్య
గలమెత్తి చాటేదను నీ కార్యములను ౹౹2౹౹
నీవే నా నిరీక్షణాధారము - నీవే నా రక్షణా శృంగము ౹౹2౹౹
1. కన్నీళ్లే కడలై నామీద పడినను
కనికరించే నాయేసయ్యా. ౹౹2౹౹
కరుణనుజూపి నన్నాదుకొన్నావు
నీ ప్రేమతోనే నాయేసయ్యా ౹౹2౹౹ ౹౹నీవే౹౹
2. శత్రువులందరూ నాచుట్టు ఉన్నను
తప్పించే తండ్రి నాయేసయ్యా. ౹౹2౹౹
కృపజూపి నన్ను విడిపించినావు
నీ ప్రేమతోనే నాయేసయ్యా. ౹౹2౹౹ ౹౹నీవే౹౹
3. శోధనాలెన్నో నన్నవారించిన
విడుదలనిచ్చే నాయేసయ్యా ౹౹2౹౹
ఆపత్కాలములో నన్నాదుకొన్నావు
నీ ప్రేమతోనే నాయేసయ్యా ౹౹2౹౹ ౹౹నీవే౹౹