అంతే లేని నీ ప్రేమ ధార Song Lyrics | Anthe Leni Nee Premadhaara Song Lyrics - Telugu Worship Song Lyrics
అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు (2)
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
పంతముతో నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
సొంతముగా నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ||అంతే||
ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
అర్హుడనే కాను నీ పేరు పిలువ
అర్హునిగా నను మార్చినావా (2)
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు ||అంతే||