సిలువలో పలికిన ఏడు మాటలు Song Lyrics | Siluvalo Palikina Yedu Matalu Song Lyrics - Good Friday Song Lyrics
సిలువలో పలికిన ఏడు మాటలు
పరదైసుపురం లో చేర్చు ప్రేమ బాటలు
మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
ముళ్ల మకుటధారి నీకు వందనం || సిలువలో ||
నిన్ను చంపు నీ శత్రువులే నీ ముందర నిలవగా
ఈటెలు కొరడాలతో, హింసిస్తూ ఉండగా
తండ్రి వీరందరూ ఏమి చేయుచుంటిరో వీరెరుగరు
వీరిని క్షమించమని పలికితివి (2). || మా రక్షణ కర్త ||
యేసు నీ రాజ్యముతో నీవు వచ్చునప్పుడు
తప్పక నన్ను చేర్చమని సిలువ దొంగ వేడగా
నేడు నీవు నాతోనే - పరదైసున నుందువు అని పలికి
ఆ దొంగను రక్షించియుంటివి (2). || మా రక్షణ కర్త ||
కన్న తల్లి మరియు యోహానును చూపించి
అమ్మా ఇదిగో నీకుమారుడని యంటివి
తల్లికాదరణగా యోహానును ఎంచుకొని
ఇదిగో నీ తల్లియని - బాంధవ్య మోసిగితివి (2). || మా రక్షణ కర్త ||
తనువునెల్ల గాయాలు తల్లడిల్ల జేయగ
తండియే యెడబాసెనని కడుదూరమాయెనని
నాదేవ నాదేవ నన్నెందుకు వీడితివని పలికి
నీ వేదన నీవేదించుకుంటివి (2). || మా రక్షణ కర్త ||
సకల సంపద నీలో గుప్తమై యున్నవి
జీవ జలహారముతో జీవుల పోషించితివి
దప్పికగొను చున్నాను అని - అప్పగిచిని పలికితివా
చేదు చీరికనే నీకు - తెరవమని ఇచ్చిరా (2). || మా రక్షణ కర్త ||
లేఖనములు నీయందే నెరవేరియున్నవి
పాప శాప భారములు వీపున భరించితివి
నీ గాయములు మాకు నిజమైన స్వస్థతలు
'సమాప్తము' అయినదని ఎలుగెత్తి చాటితివా (2). || మా రక్షణ కర్త ||
అద్వితీయ కుమారుడా అధికశక్తినొందితివి
ఆత్మతో సత్యముతో తండ్రిని ఘనపరిచితివి
తండ్రీ! నా ఆత్మను నీకు అప్పగింతునంటివి
నీ అంతట నీ ఆత్మను అర్పించితివి (2). || మా రక్షణ కర్త ||
సిలువ యాగ సమయాన సర్వ సృష్టి సడలినది
అవని దద్దరిల్లినది గుడి టెరియచీలినది
సమాధుల నున్నవారు - తిరిగి లేచి నడిచిరి
రవితేజము సన్నగిల్లే - సిలువ వెలుగు ప్రజ్వరిల్లే (2)
మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం
ముళ్ల మకుటధారి నీకు వందనం (2)