పునరుద్ధానుడా విజయశీలుడా Song Lyrics | Punarudhanuda Vijayaseeluda Song Lyrics - Latest Good Friday Song Lyrics
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా
నా ప్రతి అవసరమును తీర్చు నట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||
1.కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా
శోథన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా ||2||
నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ||2||
ప్రేమాపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||
2.మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా
అంధకారం తొలగించే వెన్నల నీవయ్యా ||2||
నా చేయీపట్టి నన్ను నడిపే రాజువు నీవయ్యా ||2||
మహిమానాధుడా నా ప్రేమాపాత్రుడా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2||
3.నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా
కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ||2||
ఆ మహిమకు నన్ను పిలుచుకున్నా పరిశుద్ధాత్ముడా ||2||
ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్యా ||2||
పునరుద్ధానుడా విజయశీలుడా
నా ప్రాణానాధుడా ||2|