నా విశ్వాస ఓడ యాత్ర Song Lyrics | Naa Viswasa Ooda Yatra Song Lyrics - Christian Faith Song Lyrics

నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు