కళ్యాణమన్నిటిలో Song Lyrics | Kalyana Mannitilo Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics

కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం
దైవత్వములోనా ఇది గొప్ప మర్మం "2"
క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం "2"
వరుడా వినుమా నీవీ సందేశం "2"
క్రీస్తుకు మాదిరి నీ జీవితం
సంఘమనే శరీరానికి క్రీస్తే శిరస్సై యున్నట్టుగా
నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి
సంరక్షించడమే నీ ధర్మం "2"
వధూవా వినుమా నీవీ ఉపదేశం "2"
మాదిరి నీవు సంఘానికి
సంఘము క్రీస్తుకు విధేయత చూపుచున్నట్టుగా
నీ భర్తకు విధేయురాలవై అతడికి భయపడి గౌరవించి
లోబడి యుండుటయే నీ ధర్మం