Type Here to Get Search Results !

నింగిలోని చందురుడా Song Lyrics | Ningilona Chanduruda Song Lyrics - AR Stevenson Good Friday Songs Lyrics

నింగిలోని చందురుడా Song Lyrics | Ningilona Chanduruda Song Lyrics - AR Stevenson Good Friday Songs Lyrics

నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2

1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన
తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ?
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2

2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి
ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area