చూడచక్కని నీ రూపమే Song Lyrics | Chudachakkani Nee Rupam Song Lyrics - Good Friday Song Lyrics
చూడచక్కని నీ రూపమే ఘోరమాయెనా
చూడలేక సూర్యుడే చీకటాయెనా
సుందరమగు నీ వదనమే మారిపోయెనా
వేదనతో నీ చెమటె రక్తమాయేనా"2"
నా కోసమేగా ఈ కలువరి శిక్ష
నా కోసమేగా ఈ ఘోర పరీక్ష
నా కోసమేగదయ్యా నా యేసయ్య
నా కోసమేగదయ్య"2"
నీవు పంచిన రొట్టెలే రాళ్ళాయెనా
ఆ చేతులకే మేకులు బిగియించెనా
నీ స్వస్థత కార్యములతో మేలు పొందిన
ఆ నోళ్ళె సిలువ వేయమని అరిచెనా"2"
జాలైన చూపలేదు _ కనికరపడలేదు"2'
శిక్షించమని అరచితిరా ఆ జనులు
సంకెళ్ళతో నిన్ను బందించినా
వధకు తేబడు పశువుగా నిన్ను మార్చిన
పిడిగుద్దులతో నిన్ను గాయపరచిన
అవమానపరిచి నిన్ను బాధపెట్టినా "2"
మాటైన పలుకలేదు - నోరైన మెదుపలేదు"2"
మౌనము వహియించితివా నా కొరకు