అన్నిటికి ఓర్చి మౌనిగా Song Lyrics | Annitiki orchi mouniga Song Lyrics - Telugu Good Friday Song Lyrics
అన్నిటికి ఓర్చి మౌనిగా
తలవాల్చినాడు
నీ కొరకే శ్రీ యేసుడు
ఆ కలువరి సిలువలో
బలియైనాడు
దీనుడై నిలిచాడు
దైవత్వమె విడచినాడు
దయతలచినాడు
క్షమియించమని యేసు పలికాడు //2//
చరణం :
హేళనాడినారు తూలనాడినారు
పిడిగుద్దులు గుద్ది మోముపై ఉమ్మినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
వధకు తేబడినాడు ఒదిగి నిలిచాడు
నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో
చరణం :
దేహమును దున్నినారు
కొరడాలతో చీల్చినారు
బడిసెలతో పొడిచి మేకులతో మోదినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
ఒంటరియైనాడు వధియించబడినాడు
నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో
చరణం :
మ్రానుకి కొట్టినారు
చేతులు చాపినారు
వస్త్రములు తీసి చీట్లు వేసినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
శ్రమలను ఓర్చినాడు యేసు మరణించినాడు
నీ కొరకే నా కొరకే ఆసిలువ లో