నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము Song Lyrics | Nenematramu Naa Jeevitham emathramu Song Lyrics - Latest Christian Song Lyrics
ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏమాత్రము
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచు ఘనకార్యములు నీ దయ వలెనే
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని
మందను వెంటాడి తిరుగుచుంటినే
సింహాసనం ఎక్కించి మైమరచితివే
నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని
తాత్కాలిక సహాయము నే అడిగితిని
యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె