నేను నా బాధను ఎవరితో Song Lyrics | NENU NAA BAADHANU EVARITHO Song Lyrics - Telugu Christian Lyrics
 
	
	
పల్లవి:- నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - 
నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - 
నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - 
నా బాధలన్నీయు నీకే తెలిసాయా 
నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2" నేను నా "
1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను  
అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను - 
నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - 
నా కన్ని నీవే నా యేసయ్యా "2" 
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను " 
2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను - 
ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - 
ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ
లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - 
నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - 
నా కన్ని నీవే నా యేసయ్యా "2" 
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను "
3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - 
మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - 
మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - 
నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - 
నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను "

