దినములు గడుచుచున్నవి Song Lyrics | Dinamulu gaduchuchunnavi Song Lyrics - Stuvartpuram Sudhakar Songs Lyrics
దినములు గడుచుచున్నవి – క్షణములు దొరలుచున్నవి
ఆయుషు తరుగుచున్నది – అంతము పిలచుచున్నది
యేసు లేని నీ జీవితము – పొందలేవు మోక్షరాజ్యము (2)
1. ఆవిరెగిరి పోవునట్లు ఎగిరిపోవుచున్నది
ఆకాశపు మేఘమువలె – తరలిపోవుచున్నవి
అంతమనే దాపుకు చేరనున్నవి (2)
భూమి విడచు గడియకు రానున్నవి (2)
యేసు లేని నీ జీవితము ..
2. పెరుగుతుంది వయసని అనుకొన్నవా
తరుగుతుంది ఆయూషని తెలియకున్నదా (2)
పరమార్ధము మరచి నీవు తిరిగుచుంటివా (2)
ప్రభు యేసు సన్నిధికి నీవు చేరవా
యేసు లేని నీ జీవితము ..
3. కన్నులుండి చూడవేల నీ శాపము
హృదయముండి ఎరుగవా నీ పాపము (2)
నరక బాధనుండి ఎవరు తప్పించెదరు (2)
నీ కొరకు బలియైన యేసయ్యే కదా (2)
యేసు లేని నీ జీవితము ..