మహోన్నతుడా నీ వాక్యము Song Lyrics | Mahonnathuda nee vakyamu Song Lyrics - Praise and Worship Songs Lyrics

మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది
మహాఘనుడా నీ ఉద్ధేశము ఉన్నతమైనది
బ్రతుకును మార్చునది రక్షణ ఇచ్చునది
బ్రతికింపజేయునది పూజింపదగినది(2)
నీకే ఆరాధన నీకే స్తోత్రార్పణ
నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా
నశించిపోతున్న నన్ను నీ వాక్యముతో దర్శించినావు
నా యందు నీ దృష్టి నిలిపి నీ ఉద్ధేశము తెలిపినావు (2)
దినదినము నా బ్రతుకును ఫలభరితముగా మార్చినావు
అనుక్షణము నీ పాత్రగా మలచుచూన్నావయ్యా
~ నీకే ఆరాధన~
నా నోట నీ శ్రేష్టమైన స్తుతి కీర్తనలు పాడుచు
నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు (2)
దినదినము నీ ప్రేమక్కై కృతజ్ఞతలు చెల్లించుచు
ఇక నా బ్రతుకు దినములన్ని నీ సాక్షినై యుందునయా
~ నీకే ఆరాధన ~