గడ్డి పువ్వులాంటి దోయి Song Lyrics | Gaddi Puvvu Lanti Dhoyi Song Lyrics - Yesu Adugujadalu Songs Lyrics

గడ్డి పువ్వులాంటి దోయి యుక్త ప్రాయము
గాలి బుడగ వంటి దోయి జీవిత అంతము "2"
ఏమౌనో ఏ దినమో ఎంచి చూడు నీ గతి
ఓ.. ఓ.. మానవా ఓ.. ఓ.. మానవా
తిరిగి రాదు నిన్న నీకు ఎన్నడెన్నడూ
స్థిరము కాదు ఇలలో రేపు నీదు ప్రాణము "2"
కృపతో కలిగే నేడు నీకు రక్షణార్ధము "2"
తడావు లేక తరుణ మెరిగి పొందు రక్షణ "2"
యేసు క్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము
అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము "2"
పాపమెల్ల పరిహరించు యేసు నామము "2"
విశ్వసించి పొందు నీవు నిత్యజీవము "2"