విడువని బంధమా Song Lyrics | Viduvani Bandhama Song Lyrics - Telugu Worship Songs Lyrics
Singer | Sis. Chaitanya |
విడువని బంధమా.. మరువని స్నేహమా..
మమతానురాగాలే నీ మకరందమా.. !
చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే..
కృపాకనికరములే నీ సౌందర్యమా..!
మమతను పంచిన మహనీయుడా..
మేలుచేయుటలో దయాళుడా
సమృద్ధినిచ్చిన శ్రీమంతుడా..
కృప చూపుటలో ఐశ్వర్యుడా..
|| విడువని ||
1.నాలోన నీవని నీతోనే పయనమని
నీవు లేకపోతే నేను లేనని..
నీవే నా ప్రాణమని .. నీతోనే మరణమని
నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని.. ||2||
వాగ్దానం చేసినవారు నను విడచి వెళ్ళినారు ..
నిబంధన చేసి నాతో - నను మరచిపోయినారు
నను ఎన్నడు విడువని మరువని బంధము నీవయ్యా ..
నా తోడై నిలిచి నడిచిన స్నేహము నీవయ్యా..
విడువని బంధము నీవేనయ్యా ..
మరువని స్నేహము నీవేనయ్యా ..
చెదరని నవ్వే నీదేనయ్యా .. నా
చెరగని జ్ఞాపకం నీవే యేసయ్యా..
||విడువని ||
2. కన్నీటిలోయలో కలత చెందే నా ప్రాణం
కరుణించువారు లేక కృంగిపోయెనే ..
కష్టాల కౌగిలిలో కలవరపడి నా హృదయం
ఓదార్చువారికోసం ఎదురుచూసేనె .. ||2||
నా దుఃఖ దినముల లోన దరికెవ్వరు రానే రాక
నా ఒంటరి బ్రతుకు లోన తోడెవ్వరు లేనేలేక
పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు..
నలిగిన నా మనసుకు నీవు నెమ్మది అయినావు..
కలతలు బాపిన నా యేసయ్యా..
కన్నీరు తుడచిన నా దైవమా..
మేలులతో నింపిన మహోన్నతుడా..
మహిమలు చేయు మహాఘనుడా..
||విడువని||