నీ సంకల్పంలో నేనున్నందున Song Lyrics | Nee Sankalpamulo Song Lyrics - Bro. A R Stevenson Songs Lyrics

Singer | Bro. A R Stevenson |
నీ సంకల్పంలో నేనున్నందున
నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
నన్ను ముందుగా నిర్ణయించి
నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి
సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా (2) (నీ సంకల్పంలో)
1.తరతరములకు ఉండును నీ సంకల్పములు
సదాకాలము నిలుచును నీ ఆలోచనలు (2)
నిన్ను దేవుడుగా గల జనులు ధన్యులు (2)
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2)
నీ సంకల్పంలో నేనున్నందున –
నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
లవ్ యు జీసస్ సర్వ్ యు జీసస్
లవ్ యు సర్వ్ యు జీసస్ (2)
2. ఎరిగినైనా వాడవు నీవు మా సంకల్పములు
పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు (2)
నిను వెదకినయెడల ప్రత్యక్షమౌదువు (2)
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2)
నీ సంకల్పంలో నేనున్నందున
నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
3. నశించిపోవును ఎపుడు రాజుల సంకల్పములు
వ్యర్ధపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు (2)
శరణాగతులకు ధైర్యమిచ్చెదవు (2)
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2) (నీ సంకల్పంలో)