ఏం కోరుకోను నీవే Song Lyrics | Em Korukonu Neeve Song Lyrics - Bro. A R Stevenson Songs Lyrics

Singer | Bro. A R Stevenson |
ఏం కోరుకోను నీవే నాకుండగాను యేసూ (2)
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేంకోరుకోను నీవే నాకుండగాను
నిర్మించావు నీనోటి మాటతో - భూమ్యాకాశములను (2)
రూపించి నరుని హెచ్చించావు - నియమించి ఏలుటకును (2)
చెలిమికి తులువను నను పిలిచిన -
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
పంపించావు ఏకైక పుత్రుని - పాప లోకమునకు (2)
చెల్లించి ఋణము అర్పించావు - తన ప్రాణం మరణమునకు (2)
నను కనుగొని కలుషము కడిగిన
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు (2)
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుట కొరకు (2)
మొరలను విని ఎదురుగ నిలిచిన -
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేంకోరుకోను నీవే నాకుండగాను