నీవు లేకపోతే నేనుండలేనయ్యా Song Lyrics | Neevu Lekapothe Nenundalenayya Song Lyrics - Nissy John Songs Lyrics
Singer | Nissy John |
నీవు లేకపోతే నేనుండలేనయ్యా
నీ ప్రేమ లేకపోతే నే బ్రతుకలేనయ్యా ౹౹2౹౹
నీ తోడు లేకపోతే నే నడువలేనయ్యా ౹౹2౹౹
నీ మాట లేకపోతే జీవించలేనయ్యా ౹౹2౹౹
నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా
నీవే చాలయ్యా నీ మాటే చాలయ్యా
1. ఈ లోకమే నన్ను అపహసించినా
నా వారే నన్ను నిందించినా ౹౹2౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
నన్నెంతో ఓదార్చేను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
నన్నెంతో ఓదార్చేను
౹౹ నీవే చాలయ్యా ౹౹
2. కష్టాల సుడిగుండాలెన్ని వచ్చినా
నష్టాల ఊబిలో పడిఉండినా౹౹ 2 ౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
చేయి పట్టి లేవనెత్తెను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
౹౹ నీవే చాలయ్యా ౹౹
3. వ్యాధిబాధలెన్నో నన్ను బాధించినా
లేవలేక నేను ఏడ్చుచుండినా౹౹2౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
నన్ను తాకి స్వస్థపరచెను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
నన్ను తాకి స్వస్థపరచెను
౹౹ నీవే చాలయ్యా ౹౹