Ghanudavu Neve Song Lyrics | ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే Song Lyrics - Jesus Songs Lyrics
Singer | Ps. Sagar |
పల్లవి:
ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము
1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము
ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
నీప్రేమే మధురము నీ మాటే మకరందము
నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను
2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును
3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే
ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము