నీ నీడలో నాబ్రతుకు గడవాలని song lyrics | Nee needalo na brathuku Song Lyrics - S P Balu Christian Songs Lyrics
Singer | S P Balu |
నీ నీడలో నాబ్రతుకు గడవాలని
నీ అడుగు జాడలలో నేనడవాలని "2"
హృదాయ వాంఛను కలిగియుంటిని "2"
నీ సహాయము కోరుకుంటిని
"నీ నీడలో"
1.నీయందు నిలిచి ఫలించాలని
ఈలోక ఆశలు జయించాలని "2"
నీప్రేమ నాలో చూపించాలని "2"
నాపొరుగువారిని ప్రేమించాలని
"హృదాయ"
2.నీసేవలో నే తరించాలని
నీకై శ్రమలను భరించాలని "2"
విశ్వాస పరుగు ముగించాలని "2"
జీవకిరీటము ధరించాలని
"హృదాయ"
3.నీరూపునాలో కనిపించాలని
నా అహమంతా నశియించాలని "2"
నీ వార్త ఇలలో ప్రకటించాలని "2"
నీ కడకు ఆత్మల నడిపించాలని
"హృదాయ"